Pargi: పరిగిలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!
Pargi: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్ సందర్భంగా పరిగిలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Pargi: పరిగిలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!
Pargi: స్వరాష్ట్ర సాధనే శ్వాసగా.. సబ్బండ వర్ణాలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన చారిత్రాత్మక ఘట్టం దీక్షా దివస్ అని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఆదివారం పరిగి పట్టణంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని, ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో దోమ మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, బి. శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్లు మీర్ తాహేర్ అలీ, రవికుమార్, మీదిగడ్డ శ్రీనివాస్, ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




