Vikarabad: దామగుండం అడవిలో కుక్కల దాడిలో జింక మృతి!
Vikarabad: దామగుండం అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. ఈ ఘటనపై ఆర్మీ, ఫారెస్ట్ అధికారుల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Vikarabad: దామగుండం అడవిలో కుక్కల దాడిలో జింక మృతి!
Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో జింకల మృతితో కలకలం రేగింది.దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అడవిలోని జింకలు జనావాసాల వైపు వస్తున్నాయని, దీంతో వీధి కుక్కల దాడులకు గురవుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. జింకల మృతికి సంబంధించి ఆర్మీ అధికారి, ఫారెస్ట్ అధికారి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేవీ అధికారులు రావడం వల్లే జింకలు మృత్యువాత పడుతున్నాయంటూ ఫారెస్ట్ అధికారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. మీరు సరిగ్గా విధులు నిర్వహించకపోవడం వల్లే జింకలు చనిపోతున్నాయంటూ ఆర్మీ అధికారి ప్రశ్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ క్రమంలో అసలు జింకలు ఎందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి? వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అధికారుల మధ్య వాదోపవాదాలు ఎలా ఉన్నా.. చివరికి ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం మూగజీవాలే.దామగుండం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
మరి ఈ మూగజీవాల మరణాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు? వన్యప్రాణులకు రక్షణ కల్పించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.




