Nagole: రూ. 2 లక్షలు దొరికితే పోలీసులకు ఇచ్చిన డెలివరీ బాయ్
Nagole: నాగోల్‌లో జెప్టో డెలివరీ బాయ్ షైక్ వాలీ అరుదైన నిజాయితీ చాటుకున్నారు.
Nagole: రూ. 2 లక్షలు దొరికితే పోలీసులకు ఇచ్చిన డెలివరీ బాయ్
నాగోల్: 4వ తరగతి మాత్రమే చదివినా నిజాయితీలో 100 మార్కులు సాధించాడు జెప్టో డెలివరీ బాయ్ షైక్ వాలీ. దొరికిన రూ.2 లక్షలను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న వాలీని నాగోల్ పోలీసులు అభినందించి సన్మానించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫార్మసీకి చెందిన రూ.5 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ప్రశాంత్ అనే వ్యక్తి బ్యాగ్‌లో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో రూ.2 లక్షలు జారి పడిపోయాయి. డబ్బు పోగొట్టుకుని లబోదిబోమంటున్న ప్రశాంత్‌కు ఊరట లభించింది.
అదే సమయంలో జెప్టోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న షైక్ వాలీకి ఆ డబ్బులు దొరకగా, ఏమాత్రం ఆశపడకుండా వెంటనే నాగోల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులకు అప్పజెప్పాడు. బతుకుదెరువు కోసం డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న వాలీ నిజాయితీని మెచ్చుకున్న నాగోల్ సీఐ గారు అతడిని శాలువాతో సన్మానించి రివార్డు అందజేశారు. అనంతరం బాధితుడు ప్రశాంత్‌కు వాలీ చేతుల మీదుగానే పోగొట్టుకున్న రూ.2 లక్షలను పోలీసులు తిరిగి ఇప్పించారు.
"చదువు తక్కువైనా సంస్కారం ఎక్కువ" అని వాలీని అక్కడున్న వారంతా కొనియాడారు. నేటి సమాజానికి వాలీ నిజాయితీ ఆదర్శమని సీఐ పేర్కొన్నారు.




