Chandanagar: బండి భగీరథను అరెస్ట్ చేయాలంటూ బిఆర్ఎస్ భారీ నిరసన!
Chandanagar: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బండి సాయి భగీరథను అరెస్ట్ చేయాలని చందానగర్‌లో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
Chandanagar: బండి భగీరథను అరెస్ట్ చేయాలంటూ బిఆర్ఎస్ భారీ నిరసన!
చందానగర్: మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడిన బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ ను అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తూ చందానగర్ లో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు పొట్ట నరేందర్ యాదవ్ ల ఆధ్వర్యంలో నిరసన.. పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు బండి సంజయ్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలనీ, కుమారుడు బండి సాయి భగీరథ ను వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ విచారణ పేరుతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.. బాధిత అమ్మాయికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.. బండి సంజయ్ వెంటనే కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు... నామ మాత్రపు కేసులు పెట్టి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పాల్గొన్నారు.




