Hayathnagar: హామీలు అమలు చేయాల్సిందే.. 250 గజాల స్థలం కోసం ఉద్యమకారుల పోరు

Hayathnagar: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) పిలుపు మేరకు ప్రజావాణికి బయలుదేరిన నాయకులను హయత్‌నగర్ పోలీసులు అడ్డుకున్నారు.

AJAY, HAYATH NAGAR
Published on: 15 May 2026 4:02 PM IST
Hayathnagar
X

Hayathnagar: హామీలు అమలు చేయాల్సిందే.. 250 గజాల స్థలం కోసం ఉద్యమకారుల పోరు

హయత్నగర్: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టిన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఉద్యమకారులకు 250 గజాల స్థలం మరియు 28 షెడ్యూల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాభవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మెమొరండం సమర్పించేందుకు హయత్‌నగర్ నుంచి బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా హయత్‌నగర్ నివాసానికి చేరుకున్న హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు, జెనిగె విష్ణువర్ధన్‌ను అక్రమంగా అరెస్టు చేసినట్లు ఉద్యమకారులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంత యాదిరెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జోరుక రామ్ ముదిరాజ్, ముసరగారి రాజు గౌడ్, రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు తండ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story