Hyderabad: రిజర్వేషన్లు అమలు చేయని ప్రైవేట్ వర్సిటీలను రద్దు చేయాలి!

Hyderabad: రిజర్వేషన్లు పాటించని ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలని సంజీవ్ నాయక్, జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. ఆగస్టు 13న జలవిహార్‌లో రౌండ్ టేబుల్ సమావేశం.

RAJESH,	WEST ZONE
Published on: 3 Aug 2026 5:25 PM IST
Hyderabad
X

Hyderabad: రిజర్వేషన్లు అమలు చేయని ప్రైవేట్ వర్సిటీలను రద్దు చేయాలి!

హైదరాబాద్: ఎస్సీ,ఎస్టీ,బిసి,ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్లను అమలు చేయకుండా డీమ్డ్,ప్రైవేటు యూనివర్సిటీలను వెంటనే రద్దు చేయాలని సంజీవ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బీసీ సంఘాల చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్,మాల సంఘాల నాయకులు మందాల భాస్కర్ చెరుకు రామచందర్,కులక చర్ల శ్రీనివాస్ లతో కలిసి మాట్లాడారు.

రాష్ట్రంలో పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుంది అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 85 శాతం మంది పేద వర్గాల ప్రజలే అని అలాంటి వారికి అన్యాయం చేస్తే ఊరుకోబోము అని హెచ్చరించారు.

అందుకే ఆగస్టు 13వ తేదీన మేధావులు రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులతో పెద్ద ఎత్తున జలవిహార్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.పేదవారికి విద్యను దూరం చేస్తే ప్రభుత్వం పెద్ద ఎత్తున తిరుగుబాటులో ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story