Vikarabad: వికారాబాద్ పట్టణాన్ని కమ్మేసిన దట్టమైన పొగ మంచు!
Vikarabad: వికారాబాద్ పట్టణం, పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ మంచు కమ్మేసింది. అనంతగిరి అటవీ ప్రాంతంలో మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Vikarabad: వికారాబాద్ పట్టణాన్ని కమ్మేసిన దట్టమైన పొగ మంచు!
Vikarabad: వికారాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలను ఈరోజు ఉదయం దట్టమైన పొగ మంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి పొగ మంచు తీవ్రత పెరగడంతో రహదారులు పరిసర ప్రాంతాలు మంచు తెరలో కనిపించాయి.
ముఖ్యంగా అనంతగిరి అటవీ ప్రాంతంలో పొగ మంచు ఎక్కువగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉదయం వేళ పొగ మంచు అందాలను చూసి పట్టణ ప్రజలు ప్రకృతి సోయగాలను ఆస్వాదించారు.




