Uppal: ప్రేమలో మోసపోయానని.. ఓయో హోటల్‌లో యువకుడి ఆత్మహత్య!

Uppal: ప్రేమ వ్యవహారంలో మోసపోయానన్న మనస్తాపంతో సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హేమంత్ సాగర్ ఉప్పల్‌లోని ఓయో హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

KARUNAKAR, UPPAL
Published on: 6 Sept 2026 10:54 PM IST
Uppal
X

Uppal: ప్రేమలో మోసపోయానని.. ఓయో హోటల్‌లో యువకుడి ఆత్మహత్య!

ఉప్పల్‌: ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉప్పల్‌లోని ఓయో హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉప్పల్ పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ వారసిగూడకు చెందిన సుక్క హేమంత్‌ సాగర్‌ (26) ఎన్‌ఎస్‌ఎల్‌ అరేనా టవర్స్‌లోని ఫౌండెవర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు.

శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్‌లోని ఎస్‌ఎల్‌ఎన్‌ గ్రాండ్‌ ఓయో హోటల్‌లో 103వ గది అద్దెకు తీసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం వరకు గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్‌ సిబ్బందికి అనుమానం వచ్చింది. గదిని పరిశీలించగా బాత్‌రూమ్‌లోని షవర్‌ పైపునకు చున్నీతో ఉరేసుకుని హేమంత్‌ సాగర్‌ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గదిలో లభించిన చేతిరాత లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ యువతి తనను మోసం చేసిందన్న మనస్తాపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి మురళి సాగర్‌ ఫిర్యాదు మేరకు ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story