Shabad: అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చూపాలి: ఎమ్మెల్యే కాలే యాదయ్య
Shabad: షాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, జీపీ భవనాలు, మహిళా సంఘ భవనాలను ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు.
Shabad: అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చూపాలి: ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్ల నియోజకవర్గం: షాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా షాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు మరియు స్ట్రీట్ లైట్లను చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా:
దేవునిగడ్డ గ్రామం (రుద్రారం గ్రామపంచాయతీ పరిధి)లోరూ.10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును, నూతనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను ప్రారంభించారు.
మాచనపల్లి గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు.
పోలారం గ్రామం లో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.10 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు.
గోపిగడ్డ గ్రామం (పోలారం గ్రామపంచాయతీ పరిధి)లోరూ.10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును, రూ.5 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ, “గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది. ప్రతి గ్రామానికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం. చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తాం” అని తెలిపారు.
అనంతరం రుద్రారం గ్రామ సర్పంచ్ శ్రీ యాదిరెడ్డి నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.




