LB Nagar: డ్రైనేజీ ముంపు సమస్యపై తక్షణమే స్పందించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే

LB Nagar: ఎమ్మెల్యే లింగోజిగూడ భాగ్యనగర్ కాలనీలో పర్యటించి, అధికారులతో మాట్లాడి రోడ్లపై నిలిచిన డ్రైనేజీ నీటి సమస్యను తక్షణమే పరిష్కరించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 29 July 2026 11:31 PM IST
LB Nagar
X

LB Nagar: డ్రైనేజీ ముంపు సమస్యపై తక్షణమే స్పందించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే

ఎల్బీనగర్: లింగోజిగూడ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో గత రెండు రోజులుగా వర్షపు నీటితో పాటు డ్రైనేజీ నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

కాలనీవాసులతో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యకు గల కారణాలను తెలుసుకుని వెంటనే వాటర్ వర్క్స్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇంద్రనగర్ నుంచి ఎస్‌బీఐ బ్యాంక్ వరకు ఉన్న ట్రంక్ లైన్‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు.

అధికారులు డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ను పరిశీలించగా, పలుచోట్ల చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి వర్షపు నీరు కాలనీలోకి చేరుతున్నట్లు గుర్తించారు. వెంటనే మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేయడంతో నిల్వ నీరు సాఫీగా వెళ్లిపోయింది.

సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ సీనియర్ నాయకులు తిలక్ రావు, కాలనీ అధ్యక్షుడు రాము, జనరల్ సెక్రటరీ జగన్నాథరెడ్డి, రాజు యాదవ్, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story