LB Nagar: వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు!

LB Nagar: వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 9 Aug 2026 10:52 AM IST
LB Nagar
X

LB Nagar: వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు!

LB Nagar:వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి,వనస్థలిపురం డివిజన్‌ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్ట రాజశేఖర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గొని శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story