Vikarabad: వికారాబాద్‌లో 1.40 లక్షల పార్థివ లింగాలతో మహా పూజలు!
Vikarabad: వికారాబాద్‌లో లింగేశ్వర నిర్మాణోత్సవంలో భాగంగా భక్తులు 1.40 లక్షల పార్థివ లింగాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన శివభక్తులు.
Vikarabad: వికారాబాద్‌లో 1.40 లక్షల పార్థివ లింగాలతో మహా పూజలు!
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్‌లో లింగేశ్వర నిర్మాణోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జ్యోతిర్ వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా 10 కోట్ల పార్థివ లింగాలతో మహాలింగ నిర్మాణం చేపట్టే మహోన్నత కార్యక్రమంలో భాగంగా భక్తులు పార్థివ లింగాలను తయారు చేశారు.
ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది భక్తులు, మహిళలు పాల్గొని 1,40,000 పార్థివ లింగాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తులకు ఆధ్యాత్మిక బోధ చేస్తూ భక్తి, ధర్మం, సత్ప్రవర్తన ప్రాధాన్యాన్ని వివరించారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు విశ్వనాథం సత్యనారాయణ, చిగుళ్లపల్లి మంజుల రమేష్, ప్రముఖులు కే. ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సబిత ఆనంద్, డాక్టర్ చంద్రప్రియ, డాక్టర్ ఉజ్వల్, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




