Secunderabad: ‘కలిసి ఉంటే కలదు సుఖం’ సదస్సులో పాల్గొన్న డీజీపీ!
Secunderabad: సికింద్రాబాద్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ ఆధ్వర్యంలో 'కలిసి ఉంటే కలదు సుఖం' కార్యక్రమం.
Secunderabad: ‘కలిసి ఉంటే కలదు సుఖం’ సదస్సులో పాల్గొన్న డీజీపీ!
సికింద్రాబాద్: ఇప్పుడు కాలం మారింది కనుక మహిళలు పురుషులతో సమానంగా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు కనుక ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగించని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. సికింద్రాబాద్ సిక్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్ లో జరుగుతున్న కలిసి ఉంటే కలదు సుఖం..
మీ సురక్ష ప్రోగ్రాంలో రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్…డీజీ చారు సిన్వా…మల్కాజ్ గిరి పోలీసు కమిషనర్ బి సుమతి తోపాటు కౌన్సిలింగ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు..ఇంట్లో గొడవలు, దంపతుల మధ్య మనస్పర్థలు విషయంలో సేఫ్ సిటీ అనే ప్రాజెక్ట్ భారత ప్రభుత్వం 8 ఏండ్ల క్రితం ప్రారంభించిందని,
మల్కాజిగిరి పోలీస్ ఆధ్వర్యంలో కలిసి ఉంటే కలదు సుఖం అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు..ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళల సాధికారత, భద్రత అభిబృది అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. విభేదాలు వచ్చి కౌన్సిలింగ్ తర్వాత కలిసి ఉండాలని భావించిన 150 కపుల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని డీజీపీ తెలిపారు.




