Dharur: రుద్రారంలో పిడుగుపాటుకు 15 మేకలు మృతి ఆదుకోవాలని డిమాండ్

Dharur: వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రుద్రారంలో అకాల వర్షానికి పిడుగు పడి 15 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. బాధితులను ఆదుకోవాలని గ్రామస్తుల డిమాండ్.

MOGULAIAH, VIKARABAD
Published on: 28 Jun 2026 8:12 PM IST
Dharur
X

Dharur: రుద్రారంలో పిడుగుపాటుకు 15 మేకలు మృతి ఆదుకోవాలని డిమాండ్

దారూర్: వికారాబాద్ జిల్లా, దారూర్ మండలం, రుద్రారం గ్రామంలో పిడుగు పడి 15 మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. గ్రామ శివారులో మేతకు వెళ్లిన మేకల మందపై ఒక్కసారిగా పిడుగు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో గొర్రెల కాపరి కుటుంబం తీవ్రంగా నష్టపోయింది.

విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story