Hyderabad: ధూల్‌పేట్‌లో 2.10 కేజీల గంజాయి పట్టివేత.. మహిళ అరెస్ట్!

Hyderabad: హైదరాబాద్ ధూల్‌పేట్ పరిధిలోని సీతారాంబాగ్‌లో కారులో గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్. 2.10 కేజీల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు. మరో ముగ్గురిపై కేసు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Sept 2026 9:22 PM IST
Hyderabad
X

Hyderabad: ధూల్‌పేట్‌లో 2.10 కేజీల గంజాయి పట్టివేత.. మహిళ అరెస్ట్!

హైదరాబాద్: దూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సీతారాం బాగ్ రోడ్ లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు దూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్ హెచ్ఓ, స్టేషన్ సీఐలు సిబ్బంది కలిసి మంగురు బస్తిలో కారులో గంజాయి పాకెట్లను అమ్మకాలు జరుపుతున్న మహిళను అరెస్ట్ చేశారు.

2.10 కేజీల గంజాయి ప్యాకెట్లతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు దూల్పేట్ ఎస్ హెచ్ ఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రవీణ్ కుమార్ తో పాటు విప్లవ రెడ్డి, వెంకన్న సిఐలు జనార్దన్, సాబీర్ హెడ్ కానిస్టేబుల్ ఈ దాడిలో పాల్గొన్నారు.

ఈ కేసులో కే.రాజేశ్వరి అనే మహిళను అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న makan లాల్, రాం లాల్, లకన్ లాల్ కు సంబంధం ఉండడంతో వీరుపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్