Yalal: డయల్ 100 కాల్ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్!

Yalal: వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామంలో డయల్ 100 కాల్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు నిలిచాయి.

Srikanth Reddy, Tandur
Published on: 6 Aug 2026 7:58 AM IST
Yalal
X

Yalal: డయల్ 100 కాల్ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్!

Yalal: డయల్ 100కి ఒక్క కాల్.. క్షణాల్లో వచ్చి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ ప్రశాంత్ రెడ్డి, జగదీష్

విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి ప్రదర్శించి కానిస్టేబుల్స్ ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన సంఘటన యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. కోకట్ గ్రామానికి చెందిన షైక్ పాషా డయల్-100 ద్వారా పోలీసులకు సమాచారం అందించి తాను రైల్వే ట్రాక్ పై చనిపోతున్నట్లు తెలపడంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ ప్రశాంత్ రెడ్డి, జగదీష్ వెంటనే స్పందించి కేవలం ఐదు నిమిషాల్లోనే లొకేషన్ ట్రేస్ చేసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అక్కడికి వెళ్లి పరిశీలించగా, అప్పుల బాధతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న షేక్ బాషా ను గుర్తించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న కానిస్టేబుల్స్ వెంటనే సమయస్ఫూర్తితో బాధితుడికి తక్షణ సహాయం అందించారు. నిండు ప్రాణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించినకానిస్టేబుల్స్ ప్రశాంత్ రెడ్డి, జగదీష్ లను యాలాల ఎస్ హెచ్ ఓ విటల్ రెడ్డి అభినందించారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story