LB Nagar: బీజేపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగంలో దర్శకుడు పీసీ ఆదిత్యకు బాధ్యతలు!

LB Nagar: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం సభ్యుడిగా సినీ దర్శకుడు డాక్టర్ పీసీ ఆదిత్య నియామకం.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 16 Oct 2026 11:52 AM IST
LB Nagar
X

LB Nagar: బీజేపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగంలో దర్శకుడు పీసీ ఆదిత్యకు బాధ్యతలు!

LB Nagar: సినీ రంగంలో మూడు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేస్తూ, నూతన కళాకారులను ప్రోత్సహిస్తున్న దర్శకుడు డాక్టర్ పీసీ ఆదిత్యకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం సభ్యుడిగా అవకాశం లభించింది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఆదేశాల మేరకు సాంస్కృతిక విభాగం కన్వీనర్ రాజమౌళి గౌడ్, కో-కన్వీనర్ శ్రీనివాసరాజు సంయుక్తంగా జారీ చేసిన నియామక పత్రాన్ని రామచంద్రరావు ఆదిత్యకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ.. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న పీసీ ఆదిత్య సేవలు పార్టీకి ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావుకు ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు, సాంస్కృతిక రంగం ద్వారా పార్టీకి సేవలందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన రాజమౌళి గౌడ్, శ్రీనివాసరాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పీసీ ఆదిత్య నియామకంపై ఆయన అభిమానులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR