Hyderabad: ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో "రిస్క్".. 'దేవుడు వారమందిస్తే' పాట విడుదల

Hyderabad: సంచలన దర్శకుడు త్రినాధరావు నక్కిన చేతుల మీదుగా ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రిస్క్" చిత్రంలోని 'దేవుడు వారమందిస్తే' అనే ప్రత్యేక గీతం గ్రాండ్‌గా లాంచ్ అయింది.

RAJESH,	WEST ZONE
Published on: 14 Jun 2026 3:35 PM IST
Hyderabad
X

Hyderabad: ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో "రిస్క్".. 'దేవుడు వారమందిస్తే' పాట విడుదల

హైదరాబాద్: సంచలన దర్శకుడు త్రినాధరావు నక్కిన చేతుల మీదుగా "దేవుడు వారమందిస్తే" పాట గ్రాండ్ లాంచ్! ​జీ.కే. మిరాకిల్స్ పతాకంపై సురేష్ రెడ్డి, గుర్రం నర్సింహులు సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం "రిస్క్". గడ్డం రవి ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని "దేవుడు వారమందిస్తే" అనే ప్రత్యేక గీతాన్ని సంచలన దర్శకుడు త్రినాధరావు నక్కిన చేతుల మీదుగా అత్యంత ఘనంగా విడుదల చేశారు.

​ఈ గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమంలో చిత్ర హీరో సందీప్ అశ్వ, కథానాయికలు సన్యా ఠాకూర్, జోయా జావేరిలతో పాటు ప్రముఖ నటుడు వై.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

​చిత్ర విశేషాలు: ​ఘంటాడి కృష్ణ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించడంతో పాటు సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న "రిస్క్" చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story