Shapur Nagar: సిపిఐ ప్రచార యాత్రలను జయప్రదం చేయండి ఉమామహేష్
Shapur Nagar: షాఫూర్ నగర్‌లో సిపిఐ ప్రచార యాత్ర పోస్టర్ ఆవిష్కరణ.
Shapur Nagar: సిపిఐ ప్రచార యాత్రలను జయప్రదం చేయండి ఉమామహేష్
షాఫూర్ నగర్: కేంద్రంలో బిజెపి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న దేశ రాజధాని ఢిల్లీలో లక్షలాదిమందితో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈనెల 6 నుండి 14 వరకు జరిగే ప్రచార యాత్రలను జయప్రదం చేయాలని కోరుతూ నేడు షాపూర్ నగర్ హమాలి అడ్డ వద్ద ప్రచార యాత్ర గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి కె స్వామి అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం నిత్యవసర ధరలు తగ్గించడంలో విఫలమైందని, కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల అన్ని నిత్యవసర వస్తువులు ధరలు పెరిగాయని, విద్య వ్యవస్థను మొత్తం బ్రష్టు పట్టించిందని, యువజన కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని వీటన్నిటి ఫలితమే నేడు ప్రజలు పోరాటాలకు సిద్ధమై ఉన్నారని ఆ పోరాటాలకు నాయకత్వం వహించడానికి కమ్యూనిస్టు పార్టీ సిద్ధమైందని అన్నారు.
స్వాతంత్రం వచ్చినప్పటినుండి బిజెపి ప్రభుత్వం ఏర్పడే వరకు 46 లక్షల కోట్లు అప్పయితే బిజెపి వచ్చి 12 ఏళ్ల కాలంలోనే లక్ష కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. అప్పు చేయడమే కాకుండా ధరలను పెంచి టాక్స్ ల పేరుతో ప్రజల నుంచి లక్షల కోట్లను వసూలు చేసిందని, ఇన్ని లక్షల కోట్లతో ఎలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించకపోగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తన మిత్రుడైన ఆదానికి మోడీ అమ్మివేశాడని దీనివల్లే నేడు అన్ని రంగాలలో ప్రభుత్వం విఫలమై ప్రజల తిరుగుబాటుకు కారణం అవుతుందని అన్నారు.
ఇలా మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తూ సెప్టెంబర్ ఒకటి నాడు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని కావున ప్రజలందరూ ప్రచార యాత్రలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, ఏఐటి యు సి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సిపిఐ నాయకులు సుంకిరెడ్డి మల్లేష్ మహేందర్ మజ్జి గౌరీ పవన్ చంద్రయ్య రమేష్ బాలు తదితరులు పాల్గొన్నారు.




