Film Nagar: ఆలయ అభివృద్ధి ప్రభుత్వానికి పట్టదా?: పల్లపు గోవర్ధన్
Film Nagar: ఫిలింనగర్‌లోని శ్రీ పర్వతాంజనేయ స్వామి ఆలయంలో కనీస వసతులు లేవని, ఆలయ అభివృద్ధి ప్రభుత్వానికి పట్టదా అని భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి పల్లపు గోవర్ధన్ ప్రశ్నించారు.
Film Nagar: ఆలయ అభివృద్ధి ప్రభుత్వానికి పట్టదా?: పల్లపు గోవర్ధన్
Film Nagar: ఫిలింనగర్‌లోని శ్రీ పర్వతాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందని భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి పల్లపు గోవర్ధన్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఆలయంలో అయ్యప్ప స్వాములకు 50 రోజుల పాటు నిర్వహించే బిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. 50 రోజుల పాటు కార్యక్రమానికి సంబంధించిన ఖర్చును మొత్తం తాను భరిస్తానని స్వాములకు హామీ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు ఆరు ఎకరాలా విస్తీర్ణంలో ఉన్న ఆలయంలో కనీస వసతులు కూడా లేవని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రోడ్డు లేదు. స్వాములు స్నానాలు చేయడానికి సాన్నపు గదులు లేవు, కనీస మంచినీటి వసతి కూడా ఆలయంలో లేదని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇవేవి కనిపించడం లేదా అని ఆయన విమర్శించారు.
త్వరలోనే ఆలయ సమస్యల పరిష్కారానికై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆలయంలో ఉన్న గోవులకు కనీసం షెడ్డు కూడా ప్రభుత్వం నిర్మించదా అని ప్రశ్నించారు. మసీదు ప్రహారీకి జీహెచ్‌ఎంసీ నిధులు ఇచ్చినప్పుడు ఆలయానికి జీహెచ్‌ఎంసీ నిధులు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయమని ఆయన అన్నారు.




