Tarnaka: తార్నాకలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుపై ఇంటింటా ప్రచారం!

Tarnaka: హైదరాబాద్ తార్నాక డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుపై బండ కార్తీక రెడ్డి, బండ శివారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

HARISH, TARNAKA
Published on: 7 Nov 2026 2:12 PM IST
Tarnaka
X

Tarnaka: తార్నాకలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుపై ఇంటింటా ప్రచారం!

Tarnaka: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. తార్నాక డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు బీజేపీ ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, బీజేపీ నాయకుడు బండ శివారెడ్డి తెలిపారు.

ఈ మేరకు వారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి తార్నాక డివిజన్‌లో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రాధాన్యతను వివరిస్తూ, అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా చైతన్యపరిచామని తెలిపారు.

పట్టభద్రులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించడంతో పాటు, వారి హక్కుల సాధనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే సమర్థవంతమైన నాయకత్వానికి మద్దతు ఇవ్వాలంటే ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ముఖ్యంగా 2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు పొందిన వారు సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవడానికి అర్హులని బండ కార్తీక రెడ్డి వివరించారు. అర్హత ఉన్నప్పటికీ అవగాహన లేక చాలామంది పట్టభద్రులు ఓటరు నమోదుకు దూరంగా ఉంటున్నారని, అలాంటి వారిని గుర్తించి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం చేపట్టామని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, పట్టభద్రుల సమస్యలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బండ కార్తీక రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కనకంట్ల హరి, సుబ్బారావు, రాము వర్మ, కాలనీవాసులు మోహన్ రావు, రామ్మోహన్ రెడ్డి తదితరులు

HARISH, TARNAKA

HARISH, TARNAKA