Sanathnagar: ASDD లిస్ట్‌లో పేరొచ్చినా ఆందోళన వద్దు: డాక్టర్ కోట నీలిమ!

Sanathnagar: సనత్‌నగర్ నియోజకవర్గంలో డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో ఓటర్ల ఏఎస్‌డీడీ (ASDD) జాబితాపై అవగాహన సదస్సులు నిర్వహించారు.

RAJESH,	WEST ZONE
Published on: 22 Aug 2026 7:07 PM IST
Sanathnagar
X

Sanathnagar: ASDD లిస్ట్‌లో పేరొచ్చినా ఆందోళన వద్దు: డాక్టర్ కోట నీలిమ!

సనత్‌నగర్: పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో SIR ఫేజ్–2లో భాగంగా SR నగర్189, 190,191 అమీర్‌పేట్ 153, 154, 155, సనత్‌నగర్ 164, 214, 215, బీకే గూడ డివిజన్ 198, 199, 202, 204, 205 బూత్‌ల పరిధిలో ASDD లిస్ట్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ దీపక్ జాన్ తో కలిసి ఆయా బూత్‌ల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ASDD లిస్ట్‌లో పేర్లు వచ్చిన ఓటర్ల వివరాలను పరిశీలించారు. కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి, వారి పేర్లు ASDD లిస్ట్‌లో నమోదవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల వివరాల్లో ఏదైనా తప్పిదం లేదా సమాచార లోపం కారణంగా పేరు ASDD లిస్ట్‌లో చేరిందా అనే అంశంపై ఆరా తీసి, వారికి అవసరమైన అవగాహన కల్పించారు.

ఈ క్రమంలో డాక్టర్ కోట నీలిమ గారు మాట్లాడుతూ.. ASDD లిస్ట్‌లో పేరు వచ్చినంత మాత్రాన ఓటు హక్కు కోల్పోయినట్లు కాదని స్పష్టం చేశారు. ASDD లిస్ట్‌లో పేర్లు ఉన్న వారు సరైన ఆధారాలు, సంబంధిత పత్రాలతో స్థానిక BLAను సంప్రదిస్తే, నిబంధనల ప్రకారం తమ పేరును తిరిగి ఎలక్టోరల్ లిస్ట్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

తమ కుటుంబ సభ్యులందరి పేర్లు ఓటర్ జాబితాలో సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ స్వయంగా పరిశీలించుకోవాలన్నారు. ఓటర్లకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత ప్రక్రియ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఓటర్ జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తుందన్నారు.

ఇంకోవైపు సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ మాట్లాడుతూ.. SIR ఫేజ్–2లో ASDD లిస్ట్‌పై ప్రతి ఓటరుకు పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ BLA, సూపర్ వైజర్, నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ASDD లిస్ట్‌లో పేరు వచ్చిన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరైన ఆధారాలతో స్థానిక BLAలను సంప్రదించి తమ వివరాలను సరిచేసుకోవచ్చన్నారు. ఓటర్ జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా ఉండేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story