Sanathnagar: బల్కంపేట ఎల్లమ్మ బోనాలకు డాక్టర్ కోట నీలిమకు ఆహ్వానం!

Sanathnagar: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రికను పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమకు అందజేసిన ఆలయ అధికారులు.

RAJESH,	WEST ZONE
Published on: 18 July 2026 3:13 PM IST
Sanathnagar
X

Sanathnagar: బల్కంపేట ఎల్లమ్మ బోనాలకు డాక్టర్ కోట నీలిమకు ఆహ్వానం!

Sanathnagar: సనత్‌నగర్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ బల్కంపేట శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ–పోచమ్మ దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించనున్న అమ్మవారి కళ్యాణం, బోనాల మహోత్సవాలకు పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమను ఆలయ అధికారులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వినోద్, సూపరింటెండెంట్ నాగరాజు,, ప్రధాన అర్చకులు అనిల్ పంతులు ఆమె స్వగృహానికి వెళ్లి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

ఆహ్వాన పత్రికను స్వీకరించిన డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవారి కళ్యాణం, బోనాల ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొనే ఈ మహోత్సవాలు రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెబుతాయని పేర్కొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించడంతో పాటు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ బోనాల ఉత్సవాలు గతంలో కంటే మరింత వైభవంగా, విజయవంతంగా జరిపేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story