Vikarabad: ఎన్నికలు అంటేనే కాంగ్రెస్‌కు వణుకు.. మెతుకు ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!

Vikarabad: "PACS ఎన్నికల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎన్నికలకు బదులు నామినేటెడ్ పద్ధతి ఎందుకు అమలు చేయాలని చూస్తోంది?

MOGULAIAH, VIKARABAD
Published on: 25 April 2026 11:26 AM IST
Vikarabad
X

Vikarabad: ఎన్నికలు అంటేనే కాంగ్రెస్‌కు వణుకు.. మెతుకు ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!

Vikarabad: రాష్ట్రంలో రైతుల తీవ్ర వ్యతిరేకత కారణంగా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే ఘోర ఓటమి తప్పదని తెలిసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో (PACS) ఎన్నికలకు వెళ్లకుండా నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం పట్ల రైతాంగంలో ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొనే దైర్యం లేక ఈ రాజకీయ పన్నాగం వేసిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే గ్రామపంచాయతీ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు షాక్ ఇవ్వడంతో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించే దైర్యం చెయ్యలేకపోతున్న సర్కార్. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, రేవంత్‌ను ఎత్తి అవతల పడేద్దామా అని సబ్బండ వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ వెన్నులో వణుకు మొదలయింది.

జగిత్యాలలో KCR గారి సభ సక్సెస్ తో ఉపిరి పీల్చుకోలేక పోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పైకి విమర్శిస్తున్న.. తన గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి. ఇప్పటికే చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ది చేకూర్చాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో నామినేటెడ్ పధ్ధతి ప్రవేశ పెట్టాలని చూస్తున్న ప్రభుత్వం. ఇదే తరహాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (డీసీఎమ్మెస్‌), రాష్ట్రస్థాయిలో మార్క్‌ఫెడ్‌, టెస్కాబ్‌ పాలకవర్గాలను కూడా నామినెటేడ్ చెయ్యాలని చూస్తున్న కాంగ్రెస్. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు డైరెక్టర్‌ పోస్టులను సైతం నామినేటెడ్‌ పద్ధతిలోనే భర్తీ చేయాలానే కుట్ర. ఎన్నికలు లేకుండానే పాలక వర్గాలా?రాష్ట్రవ్యాప్తంగా 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.

908 మంది కాంగ్రెస్ నాయకులను చైర్మన్లుగా, మరో 908మందికి వైస్‌ చైర్మన్లుగా, 9,988మందికి డైరెక్టర్లుగా నియమించాలానే అత్యంత దురాశతోనే ఈ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ. వ్యవసాయ సహకార సంఘాల్లో (PACS) ఎన్నికల ద్వారా కొలువు దీరిన పాలక వర్గాలు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు మరియు తక్కువ వడ్డీకి రుణాలు అందించడంలో ముందున్నాయి. ఎన్నికలు లేకుండా కొలువు దీరే పాలక వర్గాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో మొత్తం 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో వికారాబాద్, మోమిన్‌పేట్, మర్పల్లి, బంట్వారం, ధారూర్ మరియు కోట్ పల్లి మండల కేంద్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) బంగారంపై రుణాలు, పంట రుణాలు, డ్రోన్ల ద్వారా సేవల, తక్కువ వడ్డీకి రుణాలు, ఎరువులు, విత్తనాల సరఫరా మరియు పంట ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను రైతులకు అందిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర నిరాశతో ఉన్న రైతులు, వ్యవసాయ సహకార సంఘాల్లో ఎన్నికలకు బదులు నామినెటేడ్ ద్వారా భర్తీ చేస్తే ప్రభుత్వానికి రైతుకు ఇంకా దూరం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని రైతులకు అవసరమైన సేవలను సజావుగా అందించాలంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story