ఉస్మానియాలో ‘విశ్వవిద్యాలయాల వికలాంగుల ఫోరం’ నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షుడిగా డాక్టర్ ఎన్. అశోక్
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో విశ్వవిద్యాలయాల వికలాంగుల ఫోరం నూతన కమిటీ ఏర్పాటైంది. అధ్యక్షుడిగా డాక్టర్ ఎన్. అశోక్ ఎన్నికవగా, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ: విశ్వవిద్యాలయాల వికలాంగుల ఫోరం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెరుకు నాగభూషణం, కొల్లి నాగేశ్వరరావు పాల్గొని నియామక పత్రాలు అందించారు. కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ ఎన్ అశోక్, ప్రధాన కార్యదర్శి పల్స ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షులు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, బండి శ్రీనివాస్, శశికళ, కుర్షిత్ లు నియమితులుకగా కోశాధికారి గా బుచ్చి రాములు, సాంస్కృతిక కార్యదర్శిలుగా ఉపేందర్, కుంట వెంకట్, సహాయ కార్యదర్శులు లుగా నాగేశ్వర్, రేణుక, ఇంద్ర, కవిత, వేణుగోపాల్ రెడ్డి లతోపాటు పలువురు సభ్యులను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్ అశోక్ మాట్లాడుతూ దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయంలో ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాలలో వికలాంగులకు అన్ని అవకాశాలు అందేవిధంగా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి సభ్యులు, దివ్యాంగ విద్యార్థులు, దివ్యాంగులు దివ్యాంగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.




