Kompally: ఆశా కార్యకర్తలతో సామూహిక వ్రతం చేయించిన డాక్టర్ ప్రీతి రెడ్డి
Kompally: కొంపల్లిలోని తన నివాసంలో 500 మందికి పైగా ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలతో శ్రావణ వరలక్ష్మి పూజ నిర్వహించిన డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి.
Kompally: ఆశా కార్యకర్తలతో సామూహిక వ్రతం చేయించిన డాక్టర్ ప్రీతి రెడ్డి
Kompally: వరలక్ష్మీ వ్రతం అనగానే సాధారణంగా బంధువులను, స్నేహితులను పిలుచుకోవడం పరిపాటి. కానీ సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ,ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలే 'నిజమైన లక్ష్మీస్వరూపులు' అని చాటిచెప్పారు డాక్టర్ ch. ప్రీతి రెడ్డి.
హైదరాబాద్ కొంపల్లిలోని తన నివాసంలో డాక్టర్ ch. ప్రీతి రెడ్డి ఆధ్వర్యంలో 'శ్రీ వరలక్ష్మి పూజ' మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) నుంచి విచ్చేసిన దాదాపు 500 మందికి పైగా అంగన్‌వాడీ మరియు ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ch. ప్రీతి రెడ్డి మాట్లాడుతూ..'లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని ఇచ్చే దేవత మాత్రమే కాదని ఇంటింటికీ తిరిగి గర్భిణులు, పసిపిల్లల ఆరోగ్యాన్ని కాపాడే ప్రతి మహిళా లక్ష్మీదేవి స్వరూపమే,అని కొనియాడారు.క్షేత్రస్థాయిలో వారు పడే కష్టాన్ని గుర్తుచేసుకుంటూ,వారందరినీ ఆత్మీయంగా ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు పసుపు-కుంకుమలు, తాంబూలాలు అందించడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు.మహిళల ఆరోగ్యం కోసం కష్టపడే మన,నిజమైన లక్ష్ములకు,పసుపు-బొట్టు ఇచ్చే అవకాశం లభించడం నా అదృష్టం.వీరి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఇలాగే ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలని కోరుకుంటున్నాను.




