Jagadgirigutta: జగద్గిరిగుట్ట బస్తీ దవాఖానలో ‘డాక్టర్స్ డే’ వేడుకలు.. వైద్యుడికి సన్మానం
Jagadgirigutta: జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ బస్తీ దవాఖానలో వైద్యుల దినోత్సవం. నిరంతర సేవలు అందిస్తున్న డాక్టర్ శ్రవణ్‌ను ఘనంగా సన్మానించిన కాలనీవాసులు.
Jagadgirigutta: జగద్గిరిగుట్ట బస్తీ దవాఖానలో ‘డాక్టర్స్ డే’ వేడుకలు.. వైద్యుడికి సన్మానం
జగద్గిరిగుట్ట: ఈ సృష్టిలో భూమి ఏర్పాటు నుండి వైద్య వృత్తి ఉంది. వైద్యం అందించే విధానంలో మార్పులు వచ్చినా రోగులకు వైద్యులు ప్రాణ దాతలుగా సేవలు అందిస్తున్నారు. మానవుడికి తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రమాదాలు, జబ్బుల బారిన పడినప్పుడు పునర్జన్మ ఇచ్చేది మాత్రం వైద్యులు అనే విషయం మన అందరికి తెలిసిందే.
నేడు పెరిగిన రేడియేషన్, ఆహారపు అలవాట్లు వల్ల రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమౌతున్నారు ప్రజలు. పర్యావరణం సమతుల్యత లేకపోవడం, వాతావరణంలో విచిత్రమైన మార్పుల వంటివే కాకుండా మనం పండించే ప్రతిదీ రసాయనాలతో వస్తున్నవే. ప్రస్తుత సమాజంలో డాక్టర్ల అవసరం తప్పనిసరి అయింది.
వారు నిర్విరామంగా సేవలు అందిస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో మరికొంతమంది వైద్యుల అవసరం ఉంటుంది. జగద్గిరిగుట్ట, వెంకటేశ్వర నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి బస్తీ దవఖాన లో నిరంతరం రోగుల తాకిడి ఎక్కువ ఉన్న డాక్టర్ శ్రవణ్ తోపాటు నర్స్ రజిత, అసిస్టెంట్ రాజు, మాత్రం అధైర్య పడకుండా ఓపికతో అందరికీ వైద్య సేవలు అందిస్తూ ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు.
వారూ చేస్తున సేవలకు కాలనీవాసులు "డాక్టర్స్ డే" సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కి పేషంట్ల సమక్షంలో శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించి కేక్ కట్ చేపించిన కాలనీవాసులు. వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వారి సమస్యలను తెలుసుకొని అధ్యయనం చేస్తూ పరిష్కారానికై కృషితో మరింత ఉత్సాహంతో వైద్య సేవలు అందిస్తారు డాక్టర్ స్రవంత్ అని పలువురు అభిప్రాయపడ్డారు.
డాక్టర్లు రోగులపట్ల తల్లిలా, తండ్రిలా వైద్యం అందించి కోలుకునే వరకు కుటుంబ సభ్యులకు సూచనలు చేస్తూ మన వెన్నంటే ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తెలుపుతారు. నేడు దేశంలో వైద్యులకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది అనే చెప్పవచ్చు. కరోనా సమయంలో వారు చేసిన సేవలు అనంతమైనవి.
మనిషిని మనిషి తాకని సమయంలో కరోనాకు భయపడకుండా తమ ప్రాణాలకు సైతం పణంగా పెట్టి సేవలు అందించారు. దేశంలో మూడు వందల అరవై ఐదు రోజులు, ఇరవై నాలుగు గంటలు పని చేస్తు వైద్యుల సేవలు అభినందనీయం .




