Gachibowli: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: డ్రైవర్‌కు రూ.5,000 జరిమానా, సేవ శిక్ష
Gachibowli: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో 315 పాయింట్లతో పట్టుబడిన డ్రైవర్ ఇస్లావత్ బాబుకు కోర్టు రూ. 5,000 జరిమానా, ఒకరోజు సామాజిక సేవ శిక్ష విధించింది.
Gachibowli: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: డ్రైవర్‌కు రూ.5,000 జరిమానా, సేవ శిక్ష
Gachibowli: మద్యం సేవించి వాహనం నడిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక డ్రైవర్‌కు న్యాయస్థానం జరిమానాతో పాటు సామాజిక సేవ శిక్షను విధించింది.గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఇస్లావత్ బాబు (27, వృత్తి: డ్రైవర్, తండ్రి: గోప్య) మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతనికి 315 పాయింట్లు నమోదయ్యాయి.
కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు నిందితుడిని నేడు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి, నిందితుడికి రూ. 5,000 జరిమానాతో పాటు ఒకరోజు సామాజిక సేవ చేయాలని తీర్పు వెలువరించినట్లు గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.




