Hyderabad: విజయవాడ టు హైదరాబాద్.. లగ్జరీ కార్లలో డ్రగ్స్ సప్లై: ఇద్దరు అరెస్ట్..!
Hyderabad: హైదరాబాద్ కొండాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad: విజయవాడ టు హైదరాబాద్.. లగ్జరీ కార్లలో డ్రగ్స్ సప్లై: ఇద్దరు అరెస్ట్..!
Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. యువతే లక్ష్యంగా కొండాపూర్‌లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించిన ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 6.09 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఒక గ్రాము MDMA డ్రగ్‌ను 5 వేలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తూ.. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం ముసుగులో ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్టు సమాచారం. లగ్జరీ కార్లలో తిరుగుతూ.. యువత, ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. మాధవ హిల్‌స్టేట్ ప్రాంతంలో ఇద్దరు నిందితులు వికాస్, భరత్ చౌదరిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ టీమ్.. ప్రధాన సరఫరాదారుడు మురళి పరారీలో ఉన్నట్టు స్పష్టం చేసింది. నిందితులను కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు.




