Shamshabad: ఎయిర్‌పోర్టులో దుబాయ్ రిటర్న్ యువకుడు మిస్సింగ్.. కలకలం రేపిన ఉదంతం!
Shamshabad: దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగిత్యాల యువకుడు ప్రశాంత్ అదృశ్యం. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన.
Shamshabad: ఎయిర్‌పోర్టులో దుబాయ్ రిటర్న్ యువకుడు మిస్సింగ్.. కలకలం రేపిన ఉదంతం!
Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో వ్యక్తి మిస్సింగ్. దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న 26 ఏళ్ల యువకుడు కనిపించకుండా పోయాడు.
దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చినట్లుగా తెలుసుకున్న ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి రాకపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల కు చెందిన ప్రశాంత్ కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్ళాడు అనంతరం గత 14వ తేదీన దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు.
దుబాయ్ నుండి ప్రశాంత్ వచ్చిన విమానంలోనే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చాడు.
అయితే ప్రశాంత్ మాత్రం అతనితోపాటు స్వగ్రామానికి చేరుకోలేదు. దీంతో ప్రశాంత్ సోదరుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రశాంత్ తో పాటు వచ్చిన వ్యక్తిని విచారించగా ప్రశాంత్ తనతో పాటు గ్రామానికి రానిని చెప్పాడన ఆ యువకుడు చెప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
ప్రశాంత్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా ప్రశాంత్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు.
అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఎక్కడకు వెళ్లాడు, ఎలా వెళ్లాడు అనే విషయమై సిసి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు.




