Dundigal: కుత్బుల్లాపూర్ పరిధిలో బీజేపీ నేత కృష్ణారెడ్డి హెచ్చరిక!

Dundigal: గండిమైసమ్మ చౌరస్తాలో ప్రధాని మోదీ ఇంటీపై దాడికి నిరసనగా దుండిగల్ బీజేపీ ప్రెసిడెంట్ పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 22 July 2026 11:59 PM IST
Dundigal
X

Dundigal: కుత్బుల్లాపూర్ పరిధిలో బీజేపీ నేత కృష్ణారెడ్డి హెచ్చరిక!

దుండిగల్: దుండిగల్ సర్కిల్ బిజెపి అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా ఢిల్లీలో విద్యార్థుల పేరుతో జరుగుతున్న నిరసనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇంటీ పైన దాడికి నిరసనగా ఒక బాధ్యతలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇలాంటి చేష్టలు చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అన్నారు

ఏదైతే పేపర్ లీకేజీల అవకతకాలు జరిగాయో వారిపైన కేసులు నమోదు చేయడం వారిని కూడా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది కానీ దీని పేరుతో దేశ వ్యతిరేక శక్తులు విదేశీ శక్తులు భారత సంస్కృతి వ్యతిరేక శక్తులు కలిసి చొరబడి విద్యార్థులను తప్పుతో పట్టిస్తున్నారు సంఘవిద్రోహశక్తులు చొరబడి దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ఇలాంటి చర్యలు మానుకోకపోతే కాంగ్రెస్ నాయకులను ప్రజలే గల్లీలో తిరగనివ్వరని హెచ్చరించారు. కావున ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వంతసు పాడడం సిగ్గుచేటు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి విగ్నేశ్వర్ చారి రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు సెన్సార్ బోర్డు మెంబర్ డి శ్యామ్ రావు మాజీ కౌన్సిలర్ సర్కిల్ ఉపాధ్యక్షులు ఎంబరి ఆంజనేయులు,సీనియర్ నాయకులు ఆకుల మల్లేష్, జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షుడు ఎం వెంకటేష్ నాయక్,సర్కిల్ ప్రధాన కార్యదర్శి తురయి భాను గౌడ్,యువ నాయకులు ఆకుల విజయ్,నామాల శ్రీకాంత్,తలారి రాజ్ కుమార్,ఆకుల యశ్వంత్,నాగబాబు, దుర్గా ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story