Hyderabad: పట్టభద్రులను ఉద్యోగులుగా మార్చడమే లక్ష్యం.. దుండ్ర కుమారస్వామి!

Hyderabad: హైదరాబాద్ మెహిదీపట్నంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పాల్గొని ఉపాధి కల్పనే ధ్యేయమన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 11 Nov 2026 12:25 PM IST
Hyderabad
X

Hyderabad: పట్టభద్రులను ఉద్యోగులుగా మార్చడమే లక్ష్యం.. దుండ్ర కుమారస్వామి!

Hyderabad: హైదరాబాద్ మెహిదీపట్నంలోని గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్‌లో నిరుద్యోగులు, పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం, జాబ్ మేళా–2026 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి పాల్గొని యువత సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పట్టభద్రులను ఉద్యోగులుగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నియామకాల్లో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పలువురు పట్టభద్రులు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి దుండ్ర కుమారస్వామి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన.. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపిస్తానని హామీ ఇచ్చారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE