Hyderabad: ఈసీఐఎల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న పోస్టర్ ఆవిష్కరణ

Hyderabad: ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని ఈసీఐఎల్‌లో ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్.

ASHOK, KAPRA
Published on: 17 Aug 2026 6:47 PM IST
Hyderabad
X

Hyderabad: ఈసీఐఎల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్-మల్కాజిగిరి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గౌడ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ... ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావాలని, ఉదయం స్థానికంగా జయంతి ఉత్సవాలు ముగించుకుని సాయంత్రానికి ర్యాలీగా ట్యాంక్ బండ్ చేరుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రతిష్ఠాపనకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గౌడ హాస్టల్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు పాండల శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ 370 ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పాపన్న బహుజన రాజ్యాన్ని స్థాపించారని గుర్తుచేశారు. రాష్ట్ర నాయకుడు తాళ్ల వెంకటేష్ గౌడ్ ఆయనను భావితరాలకు స్ఫూర్తిదాతగా అభివర్ణించారు.

ఈనెల 18న ఈసీఐఎల్‌లో పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ హాజరై జయప్రదం చేయాలని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తాళ్ల ఆనంద్ గౌడ్ కోరారు. కార్యక్రమంలో రామకృష్ణ, శోభన్ బాబు, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story