Uppal: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి మట్టి వినాయక ప్రతిమ అందజేత!

Uppal: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి మట్టి వినాయకుడిని అందజేసిన సహాయ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మహేందర్. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.

ASHOK, KAPRA
Published on: 1 Sept 2026 11:59 AM IST
Uppal
X

Uppal: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి మట్టి వినాయక ప్రతిమ అందజేత!

Uppal: కాప్రా సర్కిల్లోని సైనిక్‌పురిలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సహాయ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మహేందర్ మట్టి వినాయకుడిని ఉప్పల్ ప్రధమ పౌరుడు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి అందజేశారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మట్టి వినాయకులను పూజించడం ద్వారా పండుగ సంప్రదాయాలను కొనసాగించడంతో పాటు, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు.

దేవుళ్లలో ఆదిదేవుడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు భక్తుల కోరికలను తీర్చే గణనాథుడు శ్రీ వినాయకుడు. వినాయకుని ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story