Hyderabad: సరూర్‌నగర్‌లో విద్యుత్ ఉద్యోగిపై వినియోగదారుడి దాడి!

Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్ విద్యుత్ కార్యాలయంలో కరెంట్ రావడం ఆలస్యం అయిందని ఆపరేటర్‌పై కర్రతో దాడి చేసిన వినియోగదారుడు శివ. రాజిరెడ్డికి గాయాలు, కేసు నమోదు.

RAHUL, MEERPET
Published on: 28 Sept 2026 5:41 PM IST
Hyderabad
X

Hyderabad: సరూర్‌నగర్‌లో విద్యుత్ ఉద్యోగిపై వినియోగదారుడి దాడి!

Hyderabad: సరూర్‌నగర్ పోచమ్మబాగ్‌కు చెందిన శివ ఇంట్లో ఓ ఫేజ్ కరెంట్ రాకపోవడంతో ఆదివారం ఉదయం విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు ఇతర పనుల్లో ఉండటంతో కరెంట్ సరఫరా పునరుద్ధరణలో ఆలస్యం జరిగింది.

దీంతో ఆగ్రహానికి గురైన శివ సరూర్‌నగర్ విద్యుత్ ఏఈ కార్యాలయానికి చేరుకుని ఆపరేటర్‌తో వాగ్వాదానికి దిగాడు. విషయం తెలుసుకున్న ఏఈతో పాటు విద్యుత్ ఉద్యోగి రాజిరెడ్డి అక్కడికి చేరుకుని సమస్యను అడిగి తెలుసుకుంటున్న సమయంలో.. శివ రాజిరెడ్డిని దూషిస్తూ కర్రతో దాడి చేశాడు.

ఈ దాడిలో రాజిరెడ్డికి గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET