Manikonda: 'ఇంకుడు గుంతల అవగాహన ర్యాలీ' విజయవంతం
Manikonda: గ్రేటర్ హైదరాబాద్ మణికొండలోని ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ (ECWA) ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఆవశ్యకతపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Manikonda: 'ఇంకుడు గుంతల అవగాహన ర్యాలీ' విజయవంతం
మణికొండ: గ్రేటర్ హైదరాబాద్ మణికొండలోని ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ (ECWA) ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల ఆవశ్యకత, నీటి సంరక్షణ, వర్షపు నీటి సద్వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నీటిని వృథా చేయకుండా, వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి చేరేలా చేసి, భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా ఉండేందుకు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
ర్యాలీలో పాల్గొన్న వారు ఈ క్రింది నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు:
* జల సంరక్షణే – జన సంరక్షణ
* నేటి నీటి బిందువులే – భవిష్యత్ అమృత ధారలు
* నీటి పొదుపు – జీవన వెలుగు
* ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత కట్టండి – కన్నీళ్లకు అడ్డుకట్ట వేయండి
ఈ కార్యక్రమానికి మణికొండ మున్సిపల్ కౌన్సిల్ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు శైలజ, మీనా ముత్యాలు, సిద్ధప్ప, బీరప్ప, బీఆర్ఎస్ నాయకులు సీతారాం ధూళిపాల, ఉపేందర్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరై నీటి పొదుపు, నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణ ఆవశ్యకతపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త అన్నమయ్య ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని సూచిస్తూ పలు విలువైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ECWA అధ్యక్షుడు కుమ్మరి రమేష్, ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.ఎస్. ఆచార్యులు, సహాయ కార్యదర్శి మనోజ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శులు అశోక్ కుమార్, సంతోష్ యాదవ్, కోశాధికారి ప్రేమ్ కుమార్, వసంత, సలహాదారులు శ్రీనివాస్, అజమతుల్లా, వేణుగోపాల్, కురుమూర్తి, శుభాని, సతీష్, ప్రసాద్, సత్తిరెడ్డి, ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పెంటారెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు, సంఘసేవకుడు ఇక్బాల్, కాలనీ వాసులు, వయోవృద్ధులు రామానుజం, ప్రభుజీ, మహిళలు, యువత, బాలబాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
చివరగా, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి చేరేలా చేయడం ద్వారా నీటి వనరులను కాపాడి, భావితరాలకు నీటి భద్రత కల్పిద్దామని నిర్వాహకులు పిలుపునిచ్చారు.




