Hyderabad: ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, మెడ్‌ట్రానిక్ కీలక ఒప్పందం!
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ప్రముఖ మెడికల్ టెక్నాలజీ సంస్థ మెడ్‌ట్రానిక్‌తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Hyderabad: ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, మెడ్‌ట్రానిక్ కీలక ఒప్పందం!
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ లోనీ మినిమల్లీ ఇన్వాసివ్ వీన్ కేర్‌ను విస్తరించేందుకు ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, మెడ్‌ట్రానిక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వెరికోస్ వీన్స్‌కు పెద్ద శస్త్రచికిత్సలు, కుట్లు లేకుండా గ్లూ థెరపీ, RFA, లేజర్ వంటి డే-కేర్ విధానాలతో చికిత్స. నొప్పి, మచ్చలు తక్కువ. వేగంగా కోలుకొని రోజువారీ పనులకు త్వరగా వెళ్లవచ్చు.
నిపుణుల సంప్రదింపులు, అధునాతన నిర్ధారణ పరీక్షలు, ఫాలో-అప్ కేర్ అన్నీ ఒకే చోట. ఎపిక్ చైర్మన్ డా. బాలాజీ పటేల్ కోలా మాట్లాడుతూ, రోగులకు ఇంటికి దగ్గరలోనే ప్రపంచ స్థాయి వాస్కులర్ కేర్ అందించడమే ధ్యేయమన్నారు. మెడ్‌ట్రానిక్ సీనియర్ డైరెక్టర్ ప్రతీక్ తివారీ ప్రకారం, ఈ భాగస్వామ్యంతో సిరల ఆరోగ్యంపై అవగాహన పెంచి, ముందస్తు చికిత్సను ప్రోత్సహిస్తారు అని అన్నారు.




