LB Nagar: బుడ్డాపై జేపీఆర్‌ దూషణలు బాధాకరం: ఎరుకల ఆత్మగౌరవ సభ!

LB Nagar: మాన్సూరాబాద్‌ ఎరుకల సంఘం ఆత్మగౌరవ సభలో కాంగ్రెస్ నేత బుడ్డా సత్యనారాయణపై కుల దూషణలకు దిగిన జేపీఆర్‌ను వెంటనే అరెస్టు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 15 Aug 2026 8:59 AM IST
LB Nagar
X

LB Nagar: బుడ్డాపై జేపీఆర్‌ దూషణలు బాధాకరం: ఎరుకల ఆత్మగౌరవ సభ!

LB Nagar: బుడ్డా సత్యనారాయణపై జేపీఆర్‌ చేసిన దూషణలు బాధాకరమని ఎరుకల, గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో అవమానకర వ్యాఖ్యలు చేయడం ద్వారా మొత్తం ఎరుకల సామాజిక వర్గాన్ని కించపరిచారని ఆరోపించారు.

మాన్సూరాబాద్‌లో కండెల వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఎరుకల సామాజికవర్గం తీవ్ర అన్యాయానికి గురైందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తమ భవిష్యత్తు మారుతుందనే నమ్మకంతో ఆ పార్టీకి అండగా నిలిచామని తెలిపారు.

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం మాన్సూరాబాద్‌ డివిజన్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బుడ్డా సత్యనారాయణను హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా నియమించడంతో ఎరుకల సామాజికవర్గం సంతోషించిందన్నారు.

అయితే, తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి తండ్రి ప్రభాకర్‌రెడ్డి బుడ్డా సత్యనారాయణను కులం పేరుతో దూషిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేశారని నాయకులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

జేపీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడు కూతటి రాములు, చిరుమర్తి శేఖర్‌, వనం గంగయ్య, చర్ల రమేష్‌, వెంకటేష్‌గౌడ్‌, పరశురామ్‌, మాదిగ పూల గంగాధర్‌, డాక్టర్‌ అమరేందర్‌, సుల్తాన్‌ రఘు, మహిళా నాయకులు శ్యామల, ప్రమీల, కోనేటి సుజాత తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story