Medchal: జవహర్‌నగర్ డంప్‌యార్డు ఆందోళనకారుల అరెస్టుపై ఈటల ఆగ్రహం
Medchal: జవహర్‌నగర్ డంప్‌యార్డు ఆందోళనకారుల అరెస్టును ఖండించిన ఎంపీ ఈటల రాజేందర్. సీఎం రేవంత్‌రెడ్డి డంప్‌యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్.
Medchal: జవహర్‌నగర్ డంప్‌యార్డు ఆందోళనకారుల అరెస్టుపై ఈటల ఆగ్రహం
మేడ్చల్: జవహర్‌నగర్ డంప్‌యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన అఖిలపక్ష, జేఏసీ నాయకులను అరెస్టు చేయడాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.
శనివారం షామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అరెస్టయిన నాయకులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డంప్‌యార్డు సమస్యపై పోరాడి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును హరించడం సరికాదన్నారు. అరెస్టులు, కేసులతో ఉద్యమాలను అణచివేయలేరని, వెంటనే అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జవహర్‌నగర్, బాలాజీనగర్ డంప్‌యార్డులో భారీగా చెత్త పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాలు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయని, నగరంలో వివిధ ప్రాంతాల్లో ఆధునిక వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం కోరారు




