LB Nagar: మధు యాష్కీకి ప్రోటోకాల్ తెలియకపోవడం సిగ్గుచేటు

LB Nagar: ఎల్బీనగర్‌లో అధికారిక కార్యక్రమాలను కాంగ్రెస్ వేదికలుగా మారుస్తున్నారని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు మండిపడ్డారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 24 Nov 2026 1:27 PM IST
LB Nagar
X

LB Nagar: మధు యాష్కీకి ప్రోటోకాల్ తెలియకపోవడం సిగ్గుచేటు

LB Nagar: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలుగా మారుస్తున్నారని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మధుయాష్కీ గౌడ్‌కు ప్రోటోకాల్‌పై అవగాహన లేకపోవడం సిగ్గుచేటని మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ విమర్శించారు.

మంగళవారం చైతన్యపురి డివిజన్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జిన్నారం విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి మధుయాష్కీ గౌడ్ అనుచరులతో కలిసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విఠల్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధిని విస్మరించి కేవలం శంకుస్థాపనలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో విభేదాలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, ఆయనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యేతో కాదు.. దమ్ముంటే తనను ఎదుర్కోవాలని విఠల్ రెడ్డి సవాల్ విసిరారు.

మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ మాట్లాడుతూ మధుయాష్కీ గౌడ్ ఏ హోదాలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా వ్యవహరించాలని సూచించారు.

మరో మాజీ కార్పొరేటర్ పద్మా నాయక్, మాజీ కౌన్సిలర్ త్రివేది సైతం కాంగ్రెస్ నాయకుల తీరుపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో మాజీ డివిజన్ అధ్యక్షుడు పవన్ కుమార్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR