Hyderabad: రహమత్ నగర్‌లో పోలియో చుక్కలు వేయించిన మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి!

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్‌లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి నిర్వహించారు.

RAJESH,	WEST ZONE
Published on: 22 Nov 2026 12:41 PM IST
Hyderabad
X

Hyderabad: రహమత్ నగర్‌లో పోలియో చుక్కలు వేయించిన మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి!

Hyderabad: ఈరోజు పోలియో ఆదివారం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్‌లో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.

ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పోలియో నివారణ ఎంతో కీలకమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన కోరారు.

ప్రభుత్వం చేపడుతున్న పోలియో నివారణ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE