Jubilee Hills: ఇందిరమ్మ బీమా నమోదు కేంద్రాన్ని సందర్శించిన సి.ఎన్. రెడ్డి!

Jubilee Hills: జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ వార్డు కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ బీమా నమోదు కేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి సందర్శించారు.

RAJESH,	WEST ZONE
Published on: 23 Nov 2026 3:32 PM IST
Jubilee Hills
X

Jubilee Hills: ఇందిరమ్మ బీమా నమోదు కేంద్రాన్ని సందర్శించిన సి.ఎన్. రెడ్డి!

జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్‌లోని వార్డు కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ భీమా పథకం నమోదు కేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి సందర్శించి, నమోదు ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అర్హులైన కుటుంబ పెద్దలు ఈ పథకానికి నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా కృషి చేయాలని తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE