LB Nagar: కొత్తపేట డివిజన్ లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు!

LB Nagar: కొత్తపేట డివిజన్ గాయత్రిపురం గణపతి, సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకల్లో మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 29 July 2026 2:12 PM IST
LB Nagar
X

LB Nagar: కొత్తపేట డివిజన్ లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు!

LB Nagar: గురుపౌర్ణమి వేడుకల్లో మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్

గాయత్రిపురం గణపతి, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. భక్తులకు శుభాకాంక్షలు

ఎల్బీనగర్....కొత్తపేట డివిజన్ పరిధిలోని గాయత్రిపురం గణపతి దేవాలయం, సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఘనంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొన్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని గణపతి, సాయిబాబా వారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందన్నారు. గురువు జ్ఞానానికి ప్రతిరూపమని, సమాజానికి సరైన మార్గదర్శనం చేసే మహనీయులను స్మరించుకునే పవిత్రమైన రోజే గురుపౌర్ణమి అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గురువులను గౌరవిస్తూ వారి ఆశీస్సులతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, భక్తులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వగ్గుల సుందర్ నారాయణ, జంగారెడ్డి, కాటా విజయ గౌడ్, లావణ్య, స్వర్ణ, యశోద, రామకృష్ణ, వెంకట్ రెడ్డి, డివిజన్ జనరల్ సెక్రటరీ గట్టు మహేష్ కుమార్, రాజేష్ ఖన్నా, నందు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story