Mallapur: అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి!
Mallapur: మల్లాపూర్‌లోని తిరుమల మిలీనియం అపార్ట్‌మెంట్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.
Mallapur: అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి!
Mallapur: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్‌లోని తిరుమల మిలీనియం అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని మల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదును నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు వాసు గౌడ్, హమాలీ శ్రీనివాస్, దయాకర్ రెడ్డి, కుంటి కృష్ణ, తీగుళ్ల శ్రీనివాస్ గౌడ్, అల్లాడి కృష్ణ యాదవ్, ఎం.డి. ఉస్మాన్, నిఖిల్ రెడ్డితో పాటు తిరుమల మిలీనియం అపార్ట్‌మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.




