Tarnaka: తార్నాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ: బండ కార్తిక రెడ్డి

Tarnaka: వినాయక చవితి సందర్భంగా తార్నాకలో మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

HARISH, TARNAKA
Published on: 13 Sept 2026 5:58 PM IST
Tarnaka
X

Tarnaka: తార్నాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ: బండ కార్తిక రెడ్డి

తార్నాక: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్‌ హైదరాబాద్‌ మాజీ మేయర్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి ఆధ్వర్యంలో తార్నాక లోని లక్ష్మీ గణపతి దేవాలయంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ కార్తిక రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమవడంతో పాటు జలచరాలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆమె వివరించారు.

అందువల్ల ప్రజలు పీవోపీ విగ్రహాలకు దూరంగా ఉండి, ప్రకృతికి హాని కలిగించని మట్టి గణపతులను పూజించాలని కోరారు. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని బండ కార్తిక రెడ్డి పేర్కొన్నారు.

పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తూ, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, నిమజ్జన సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఆమె సూచించారు. ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA