Boduppal: పల్స్ పోలియో చుక్కలు వేసిన మాజీ మేయర్ అజయ్ యాదవ్!
Boduppal: బోడుప్పల్ సర్కిల్ అంబేద్కర్ నగర్ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ నిర్వహించారు.
Boduppal: పల్స్ పోలియో చుక్కలు వేసిన మాజీ మేయర్ అజయ్ యాదవ్!
Boduppal: చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి కాపాడేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ సూచించారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. చిన్నారుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడు బొమ్మక్ కళ్యాణ్, యాదగిరి, బొమ్మక్ శ్రీనివాస్, తోటకూర రవీందర్ యాదవ్, శివ యాదవ్, వైద్యులు, నర్సులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.




