Boduppal: బోడుప్పల్, పీర్జాదిగూడలో దుర్గామాతకు మాజీ మేయర్ అజయ్ యాదవ్ పూజలు

Boduppal: బోడుప్పల్, పీర్జాదిగూడ డివిజన్లలోని దుర్గామాత మండపాలను సందర్శించి మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

KARUNAKAR, UPPAL
Published on: 16 Oct 2026 11:49 PM IST
Boduppal
X

Boduppal: బోడుప్పల్, పీర్జాదిగూడలో దుర్గామాతకు మాజీ మేయర్ అజయ్ యాదవ్ పూజలు

బోడుప్పల్‌: దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ డివిజన్లలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను సందర్శించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. ప్రజల జీవితాల్లో శాంతి, సంతోషం, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిభావానికి, ఆధ్యాత్మికతకు ప్రతీకలని, ఈ వేడుకలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ డివిజన్లలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో పలు మండపాలను సందర్శించిన తోటకూర అజయ్ యాదవ్‌కు ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL