Vikarabad: డబల్ బెడ్రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఫైర్!
Vikarabad: ధారూర్‌లో అర్హులైన పేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా తాగుబోతులకు అడ్డాలుగా మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆగ్రహం.
Vikarabad: డబల్ బెడ్రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఫైర్!
Vikarabad: ధారూర్ పట్టణంలో BRS ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మా BRS ప్రభుత్వ హయాంలోనే 90% డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. కానీ నేడు లబ్ధిదారులకు 10% పూర్తి చేసి అందించాల్సిన ఇళ్లు నిర్లక్ష్యంతో తాగుబోతులకు, గంజాయి బ్యాచ్లకు అడ్డాలుగా మారడం బాధాకరం.
ధారూర్‌లో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులకు పేదవాళ్లు కనిపించడం లేదా? మా నాయకుడు KCR గారికి పేరు వస్తుందనే కారణంతోనే ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉంది. వెంటనే అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలి” అని ఆయన విమర్శించారు.




