Vikarabad: బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మెతుకు ఆనంద్!
Vikarabad: వికారాబాద్ అనంతగిరి బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.
Vikarabad: బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మెతుకు ఆనంద్!
Vikarabad: వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం విషయం తెలుసుకున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు సంఘటన స్థలాన్ని పరిశీలించి, అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ₹25 లక్షలు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కూడా ₹25 లక్షల పరిహారం అందించాలి.
కాళ్లు, చేతులు విరిగిన తీవ్ర గాయాలైన వారికి ₹10 లక్షల పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే పూర్తిగా భరించాలి.
బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారని, ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల ఫిట్‌నెస్‌పై యాజమాన్యాలు, అధికారులు నిర్లక్ష్యం చేయకూడదన్నారు.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా RTA అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలను ఎప్పటికప్పుడు కఠినంగా మానిటర్ చేయాలి. ఫిట్‌నెస్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని డాక్టర్ మెతుకు ఆనంద్ గారు డిమాండ్ చేశారు.




