LB Nagar: రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం!

LB Nagar: ఎల్బీనగర్‌లో మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 21 July 2026 10:35 PM IST
LB Nagar
X

LB Nagar: రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం!

ఎల్బీనగర్: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడాన్ని మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఖండించారు.

ప్రశ్నించే వారిని అణచివేయడం మోదీ ప్రభుత్వ విధానంగా మారిందని ఆయన విమర్శించారు. నీట్ పేపర్ లీక్‌పై ఇప్పటివరకు ప్రధాని మోదీ స్పందించలేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీక్‌తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని, నిరసన తెలిపిన యువతపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దురదృష్టకరమన్నారు. యువతకు అండగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, ఆయనకు ప్రజలు మద్దతుగా నిలవాలని మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story